మెదక్: రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు తెలిపారు.