TPT: డిప్యూటీ మేయర్ ఎన్నికల అభ్యర్థిగా శేఖర్ రెడ్డి పేరు ప్రకటిస్తే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుందని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా వైసీపీ కార్పోరేట్ ప్రైవేట్ ఆస్తులపై అధికారులను పంపి భయపెట్టాలని చూడడం సరైనదికాదన్నారు.