ELR: ఏలూరు అమీనా పేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ ప్రక్కన గల కళ్యాణ మండపంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు శనివారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నేత్ర వైద్యం, పీడియాట్రిక్ జనరల్ మెడిసిన్స్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.