HYD: బాచుపల్లి రహదారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ 100 ఫీట్ల బీటీ రోడ్డు పక్కన వేలాది లీటర్ల మంచినీరు వృథాగా పోతుందని స్థానికులు తెలిపారు. అశోక్ మనోజ్నగర్ పక్కనే ఈ పరిస్థితి ఉందన్నారు. దీనిపై అధికారులు స్పందించి, వాటర్ లీకేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. వృథా అయిన మంచినీరు రోడ్డు పై ఏరులై పారుతోందన్నారు.