WGL: తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవల మరణించిన మేడిపల్లి కిరణ్ కుటుంబాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి పరామర్శించారు . కిరణ్ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వినయ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రతాపరెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.