ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా ఇది రాబోతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాకు పోటీగా మరో సినిమా బరిలోకి దిగే అవకాశాలు తక్కువ. కానీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. సలార్‌తో సై అనేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు హృతిక్ సైతం సైడ్ అయిపోయాడు. సలార్(Salaar) సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
అదే రోజు హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ కూడా రాబోతున్నట్టు ప్రకటించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెకుతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దాంతో ప్రభాస్, హృతిక్‌ల మధ్య టఫ్ ఫైట్ ఉండండం పక్కా అనుకున్నారు. అదే జరిగితే దాని ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై ఖచ్చితంగా ఉంటుంది. పైగా బాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది.. అందుకు నిదర్శనమే సాహో సినిమా ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో సలార్‌తో పోటీ ఎందుకు అనున్నారో లేక.. ఇత కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు గానీ.. తాజాగా ఫైటర్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను 2024 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతో ఫైటర్ సైడ్ అయిపోవడంతో.. సలార్‌కి లైన్ క్లియర్ అయ్యినట్టేనని చెప్పొప్చు. ఇక పోతే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సలార్ షూటింగ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది సలార్ టీమ్.