మెనోపాజ్‌లో ఎదురయ్యే సమస్యల్లో పొట్ట పెరగటం కూడా ఒకటి. గంటల తరబడి కూర్చోని పనిచేసే వారిలో ఇది మరింత ఎక్కువ. అలాకాకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, అవిసె గింజలు, ఓట్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గితే పొట్ట చాలావరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.