»Election Commission To Announce Karnataka Assembly Poll Dates Today
Karnataka అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన ఈరోజే
Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్లో గల ప్లీనరీ హాల్లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేస్తారు.
Election Commission to announce Karnataka assembly poll dates today
Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్లో గల ప్లీనరీ హాల్లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేస్తారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) ప్రచారంలో బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీ (modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఆప్ కూడా 80 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 224 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఇదివరకే ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్నిగంటల్లో తేదీలను ఈసీ ప్రకటించనుంది.