»Ashok Chavan Welcomed Kcrs Stance Against The Disqualification Of Rahul Gandhi
Ashok Chavan: కేసీఆర్ రాజకీయం అర్థం కావడం లేదన్న కాంగ్రెస్ మాజీ సీఎం
తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ashok Chavan) అన్నారు.
తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ashok Chavan) అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లోకి (Maharashtra Politics) బీఆర్ఎస్ (BRS) ప్రవేశించడంపై కూడా ఆయన స్పందించారు. ఇక్కడి రాజకీయాల్లోకి ఆ పార్టీ రావడాన్ని తాము స్వాగతిస్తామని, ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఎక్కడ అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో (maharashtra panchayat election) పోటీ చేసేందుకు సిద్ధం కావడం వారి ఇష్టమని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికే నాందెడ్ జిల్లాకు రెండుసార్లు వచ్చారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ (KCR) బీజేపీకి (BJP) వ్యతిరేకంగా పని చేస్తున్నారో… కాంగ్రెస్ కు (Congress) వ్యతిరేకంగా పని చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన హైదరాబాద్ లో (Hyderabad) మీడియాతో మాట్లాడారు.
అశోక్ చవాన్ (Ashok Chavan) ఇంకా మాట్లాడుతూ… దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే రాహుల్ పైన అనర్హత వేటు వేశారని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనా ఆక్రమణ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అధికార పార్టీ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అదానీ అక్రమాల పైన లోకసభలో రాహుల్ ప్రశ్నిస్తే మైక్ కట్ చేశారన్నారు. అదానీ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై కేంద్రం వద్ద సమాధానం లేదన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐ నిధులను కేంద్రం అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టిందన్నారు. వీర సావర్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని ఉద్దవ్ థాకరే హెచ్చరించిన విషయం తెలిసింది. ఈ అంశంపై మాట్లాడుతూ… రాహుల్ కు ఉద్దవ్ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర వికాస్ అఘాడీ (Maharashtra Vikas Aghadi) పొత్తుకు వచ్చిన ఇబ్బంది లేదన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ థాకరే శివసేన వర్గం కలిసే ఉంటాయన్నారు.