PDPL: రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం ఎంపీ వంశీకృష్ణ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.