నెల్లూరు: ఉదయగిరి మండలం బండగానిపల్లె పంచాయతీ కృష్ణారెడ్డి పల్లె గ్రామానికి చెందిన డి. సుధాకర్ రెడ్డి తన ఇంటిపై వెళ్తున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలను తొలగించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. తాను జానపద కోసం ఆ ప్రాంతాలకు వలస వెళ్లిన సమయంలో విద్యుత్ శాఖ అధికారులు తన ఇంటి మీదుగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారన్నారు.