BPT: కర్లపాలెం మండల పరిధిలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం జరిగింది. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పెనుమెత్స నాగరాజు(చిన్న బాబు) ఆధ్వర్యంలో రెండు రోజులుగా పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని అప్పటి తమ గురువులైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.