TPT: చౌడేపల్లి మండల పుదిపట్ల గ్రామంలో వెలసియున్న శ్రీ వైష్ణవి మాత శుక్రవారం ప్రత్యేక పూజలు అందుకుంది. అమ్మవారి మూలవర్లను అభిషేకించిన అనంత వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారిని వెంకటేశ్వర స్వామి రూపంలో అలంకరించారు. గ్రామంలోని భక్తులు వైష్ణవి మాతను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో నేతి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.