CTR: 13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.