సినీ నటుడు అలీ(ali)…. గత కొన్ని సంవత్సరాలుగా…. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కీలక పదవి ఏదో వస్తుంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. అలీ కూడా అంతే ఆశపెట్టుకున్నారు కానీ… ఎలాంటి పదవీ దక్కలేదు. కొంతకాలంగా ఆయన వైసీపీని వీడి.. జనసేనలోకి వెళ్లనున్నారు అనే ప్రచారం మొదలైంది. మరి కొద్ది రోజుల్లో జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనగా… చిన్నపిల్లాడికి తాయిళం ఇచ్చినట్లుగా.. మీడియా సలహాదరుడి పదవి ఇచ్చి జగన్(jagan) అలీని కామ్ చేశారు. నిజం చెప్పాలంటే… ఈ పదవి ఇవ్వకుంటే అలీ కచ్చితంగా జనసేనలో చేరేవాడే. కానీ ఆ విషయాన్ని డైరెక్ట్ గా మీడియాకు చెప్పలేరు కదా.. అందుకే కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
‘నేను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే జగన్కు నా ఉద్దేశాన్ని స్పష్టం చేశాను. నేను పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయాన్ని ఆయనకు స్పష్టం చేశాను . గతంలో కూడా నా పదవి గురించి వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాను. అయితే నా గురించి జగన్కు తెలుసు. అందుకు నిదర్శనమే ఈ పదవి. ఈ పదవి జగన్ నా కూతురి పెళ్లికి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను’ అంటూ అలీ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని పదవిలో అలీ రెండేళ్లపాటు ఉండనున్నారు. ఈ పదవికి సంబంధించి అలీ జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు.