E.G: నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఆదివారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తల మధ్య గొడవతో మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. తల్లిచనిపోయిందని తెలియని ఆ చిన్నారులు అమ్మకావాలని అంటుడటం అక్కడివారి కంట కన్నీరు తెప్పించింది. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.