VSP: సబ్బవరం PS పరిధిలోని అమ్ములపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. బలిజపాలెంకు చెందిన సూర్యారావు(48), భార్య మంగమ్మ ఆదివారం సబ్బవరం వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు బైక్పై స్వగ్రామం బయలుదేరారు. అమ్ములపాలెం వద్ద వెనుక వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యారావు చనిపోయారు.