ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరు ఫ్లై ఓవర్ దగ్గర ఆదివారం ఉదయం టంగుటూరు నుండి వస్తున్న ఆటోను వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న టంగుటూరుకి చెందిన లక్కే పద్మ మరణించింది. ఇద్దరికీ గాయాలయ్యయి. వీరు బొంతలు కుట్టటానికి ఒంగోలు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.