NLG: భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రేపు నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన జిల్లా కేంద్రంలోని NG కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు CPI జాతీయ ప్రధాన కార్యదర్శి D.రాజా, MLA కూనంనేని సాంబశివరావు పలువురు నేతలు పాల్గొంటారన్నారు.