SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 29 ఉదయం గం.6 నుంచి జనవరి 13వ తేదీ ఉదయం గం.6 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ డా. బీ. అనురాధ శనివారం తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.