BDK: పాల్వంచ పోస్టల్ సిబ్బంది అంకితభావంతో ముందుకెళ్లాలని పాల్వంచ సబ్ డివిజనల్ పోస్టల్ ఎస్పీ వీరభద్ర స్వామి అన్నారు. మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను వారికి చేరువ చేయాలని కోరారు.