JGL: ఫీజు రియంబర్స్ మెంట్ సాధనకై జనవరి 8న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ అన్నారు. జగిత్యాల పట్టణంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బీసీ విద్యార్థి సంఘం ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు.