NLG: నూతన సంవత్సర వేడుకల పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు బైకులు, కార్లను ఇవ్వద్దన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవింగ్, అతివేగం, బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.