MHBD: దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె. అనిల్ కుమార్, తదితరులున్నారు.