MNCL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జన్నారం వర్తక సంఘం నాయకులు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా పట్టణంలోని వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. మన్మోహన్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వామన్ కుమార్, జక్కు రమేష్, కోశాధికారి శివకృష్ణ, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ సభ్యులు ఉన్నారు.