ELR: ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.