NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవి పేట హరిజనవాడ నందు శనివారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు రక్తపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు కీటక జనిత వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు.