ATP: గుంతకల్లులోని ఆర్ఎంఎస్ కార్యాలయం తరలింపుకు వ్యతిరేకంగా జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు శనివారం వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్ఎంఎస్ కార్యాలయం తరలింపు నిర్ణయం మానుకోవాలని లేకుంటే భవిష్యత్తులో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.