KKD: పెద్దాపురం కన్జ్యూమర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బళ్లమూడి సూర్యనారాయణ మూర్తి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనకు సేవా అవార్డు లభించింది. జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.