ATP: హైదరాబాద్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ కలిశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మారుమూల గ్రామాల నుంచి వృద్ధులు పట్టణాలకు వైద్యం కోసం రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.