కోనసీమ: రావులపాలెం జాతీయ స్థాయి నెట్ బాల్ బాల్ పోటీలకు ఈతకోట విద్యార్థి ఎంపికైనట్లు నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన అండర్-16 విభాగం రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో ఈతకోట ఉన్నతపాఠశాల 8వ తరగతి విద్యార్థి యార్లగడ్డ లావణ్య ప్రతిభ చాటుకొని చెన్నైలో జరిగే జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికైంది.