పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం కలక్టరేట్లో ఎంఈఓ లతో వీడియో కాన్ఫరెన్స్లో టెన్త్ విద్యార్థులపై సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని అన్నారు.