ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన ప్రకటనపై నవీన్ పట్నాయక్ స్పందించారు. గిరిరాజ్ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. భారతరత్న స్వీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆ డిమాండ్ ఎందుకు చేశారో తనకు తెలియదని చెప్పారు. ప్రజల కోసం మరింత పని చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.