»Security Failure In Prime Minister Modis Road Show In Karnataka
PM MODI: మరోసారి ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..వీడియో వైరల్
కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

ప్రధాని మోదీ(PM MODI) కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ టైంలో అక్కడున్న పోలీసులు ఆ వ్యక్తి ఆపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. దావనగిరిలోనే మూడు చోట్ల భద్రతాలోపం కనిపించింది. ప్రధాని ర్యాలీ(Rally)లోకి వచ్చిన వ్యక్తిని బస్వరాజ్ గా గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కూడా ప్రధాని మోదీ(PM MODI) కర్ణాటకలో పర్యటిస్తుండగా ఇటువంటి ఘటనే జరిగింది. భద్రతా సిబ్బందిని దాటుకుని ఓ వ్యక్తి మోదీకి దండ వేసేందుకు ప్రయత్నించాడు. ఆ టైంలో కూడా ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో రోడ్ షో తర్వాత మోదీ 29వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో 30 వేల మందికిపైగా యువతీయువకులు పాల్గొన్నారు.