KTR : ఎల్బీనగర్ లో మరో ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
ఎల్బీనగర్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ కారణంగా ఆ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే చెప్పాలి. కాగా.. ఫ్లై ఓవర్ ప్రారంభించిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు.

నగరంలో అన్ని ఫ్లై ఓవర్లు పూర్తవుతున్నాయని, నాగోల్ మెట్రోను ఎల్బీ నగర్ కు జోడిస్తామని అన్నారు. హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేస్తామన్న ఆయన సెప్టెంబర్ లో మూడు ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తామని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీ నగర్ చౌరస్తాకు నామకరణం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. నిజానికి ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని గుర్తు చేసిన కేటీఆర్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పిందని అన్నారు. అంతేకాదు ఫ్లై ఓవర్లు పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్తానని కేటీఆర్ అన్నారు.