KNR: హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని గోలిపల్లి అంజలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. దీంతో అంజలి స్వగ్రామమైన మహ్మదాపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు.