మారుతున్న జీవనశైలి వల్ల డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో సగానికి పైగా మహిళలే ఉంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ తగ్గించటానికి నడకే మంచి మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం నడవటం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి, నాడీవ్యవస్థ బలంగా మారుతుంది. సూర్యరశ్మిలో నడిస్తే నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి.