కృష్ణా: గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అమలుపై మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో విష్ణు ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో నరసింహారావు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ వినియోగ విధానం, కుటుంబ స్థాయి వివరాల సేకరణ, డేటా నమోదు ప్రక్రియ అంశాలపై అవగాహన కల్పించారు.