NGKL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కల్వకుర్తి న్యాయస్థానం ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు. తర్నికల్ గ్రామానికి చెందిన గొడుగు మహేందర్‌కు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. పట్టణానికి చెందిన తుప్పల నరసింహ అనే వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు.