»Cid Notices To Ap Tdp Leader Chintakayala Vijay Once Again
AP TDP నేత చింతకాయల విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు
ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay) కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు.
ఆ క్రమంలో విజయ్ లేకపోవడంతో ఆయన తండ్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి నోటీసు అందించారు. అయితే ఈ అంశంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినందుకే ప్రభుత్వం తట్టుకోలేక కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 41ఏ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విజయ్ పలుమార్లు నోటీసులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.
భారతి పే పేరిట సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై AP సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు ఆయనను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.