»Win Over Up In Wpl 2023 Mumbai Indians Reached The Final
WPL 2023లో యూపీపై గెలుపు..ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ స్కివర్ బ్రంట్(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు ఘన విజయం సాధించింది. యూపీ వారియర్జ్(UP Warriorz)ను 72 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సాధించింది. ఈ క్రమంలో WPL 2023 ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్కివర్ బ్రంట్(72), అమేలియా కెర్ (29), హేలీ మాథ్యూస్ (26), యాస్తికా భాటియా (21), హర్మన్‌ప్రీత్ కౌర్ (14) రన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్(UP Warriorz) జట్టు మొదట్లోనే తడబడింది.
కెప్టెన్ అలిస్సా హీలీ(11), శ్వేతా సెహ్రావత్(1) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ నవ్‌గిరే 27 బంతుల్లో 43 పరుగులు చేసి మంచి సపోర్ట్ ఇచ్చింది. కానీ తర్వాత వచ్చిన వారు సైతం ఒక్కరు కూడా 16 పరుగులకు మించి చేయలేదు. దీంతో 182 పరుగుల లక్ష్యం దగ్గరకు కూడా పోకుండా.. 110 రన్స్ చేసి ఆలౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముంబయి(Mumbai Indians) బౌలర్లు ఇస్సీ వాంగ్(4), సైకా ఇషాక్(2), నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలితలు ఒక్కో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.