VSP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు NYK ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు కడపలో జరిగే అంతర జిల్లాల యువజన సమ్మేళనంలో పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ డా. నాయక్ తెలిపారు. యువ సమ్మేళనంలో విద్యార్ధులు పాల్గొనటం వలన వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందని వైస్ ప్రిన్సిపాల్స్ డా పుష్పరాజు అన్నారు. ఎన్వైకే అధికారులకు కృతజ్ఞత తెలిపారు.