»Corona Boom Again In The Country The Threat Of The Looming Virus
Corona virus : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ..పొంచి ఉన్న వైరస్ ముప్పు
దేశంలో కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న సమయంలో కోవిడ్ (Covid) మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(positive cases )సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది.
దేశంలో కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న సమయంలో కోవిడ్ (Covid) మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(positive cases )సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 5,30,818కు చేరింది . ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి దేశవ్యాప్తంగా 4,41,61,922 మంది పూర్తిగా కోలుకున్నారు.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Central Medical Health Department) అధికారులు తెలిపారు. కోలుకున్నవారి రేట్ 98.79 శాతం ఉండగా, మరణాల రేట్ 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Department) తెలిపింది. కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సాకాగ్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 344 కేసులు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడైంది.