జపాన్‌లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ముఖ్యంగా తారక్, చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్(RRR) జపాన్ వెర్షన్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.. కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో జపాన్ వీధుల్లో విహరిస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్. వీళ్లంతా కలిసి నడుస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చెర్రీ. ఇది చూసిన తర్వాత ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగా, నందమూరి అభిమానులు.
ఇక జపనీయులు చరణ్, తారక్‌కు అడుగడునా బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. అంతేకాదు కొంత మంది తమ అభిమాన నటున్ని దగ్గరి నుంచి చూసి.. ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే కాదు.. అక్కడ ఆర్ఆర్ఆర్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉందడానికి నిదర్శనంగా.. చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక జపాన్‌లో మన దేశానికి ఓ ప్రౌడ్ మూమెంట్ చోటు చేసుకుంది. మన జెండా చేతబట్టి.. వందేమాతరంను అలపించేలా.. భారత్ పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్త పరిచారు జపాన్ ప్రజలు. ఈ మూమెంట్ మన దేశం గర్వించేలా ఉంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఒక్క జపాన్ అనే కాదు.. అన్ని దేశాల్లోను ఇండియన్ సినిమా సత్తాను చాటిందని చెప్పొచ్చు.