Movie Teaser: ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్ రిలీజ్
టాలీవుడ్(Tollywood)లో సరికొత్త ప్రేమకథ(Love story)తో మరో జంట తెలుగు తెరకు పరిచయం అవుతోంది. యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త లవ్ స్టోరీతో 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'(Krishnagadu ante oka range) అనే సినిమా రూపొందుతోంది. రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. పెట్లా కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, శ్రీలత సంయుక్తంగా ఈ మూవీ(Movie)ని రూపొందించారు.
టాలీవుడ్(Tollywood)లో సరికొత్త ప్రేమకథ(Love story)తో మరో జంట తెలుగు తెరకు పరిచయం అవుతోంది. యూత్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త లవ్ స్టోరీతో ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'(Krishnagadu ante oka range) అనే సినిమా రూపొందుతోంది. రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. పెట్లా కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, శ్రీలత సంయుక్తంగా ఈ మూవీ(Movie)ని రూపొందించారు.
‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'(Krishnagadu ante oka range) సినిమా ద్వారా డైరెక్టర్ గా రాజేశ్ దొండపాటి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ శ్రీవాస్(Director Srivas) ఈ సినిమా టీజర్(Teaser)ను విడుదల చేశారు. రెండు నిమిషాలకుపైగా ఈ టీజర్ ఉంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ సీన్లను కట్ చేసి టీజర్ గా రిలీజ్(Teaser Release) చేశారు.
ఈ సినిమా(Movie)లో పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా ఈ సినిమాకు కలిసి వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. టీజర్ లో సాబు వర్గీస్ ఆర్ఆర్ ఆకట్టుకుంటాయని, ఎస్ కే రఫి కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్(Release Date)ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.