NTR30 Grand Launch : అంచనాలు పెంచేసిన కొరటాల.. ఎన్టీఆర్ 30లో మృగాలే ఎక్కువ..!
Grand Launch : ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, దిల్ రాజు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ.. సముద్రం నేపథ్యంలో.. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరెక్కబోతోంది.
ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, దిల్ రాజు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ.. సముద్రం నేపథ్యంలో.. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరెక్కబోతోంది. సముద్ర తీర ప్రాంతంలో మనం మర్చిపోయిన భూభాగంలో.. మనుషుల కంటే ఎక్కువ మృగాలే ఉంటాయి. వాటికి దేవుడు అంటే భయం లేదు.. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది.. అంటూ ఎన్టీఆర్ రోల్‌కు ఎలివేషన్ ఇచ్చాడు. భయం ఉండాలి, భయం అవసరం కూడా.. భయపెట్టడానికి తన హీరో ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నానని.. చెప్పారు కొరటాల. దాంతో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమాలో యంగ్ టైగర్ క్రూర మృగాలను వేటాడబోతున్నాడు. ఫస్ట్ టైం కొరటాల బౌండరీస్ దాటి ఈ సినిమాను చేయబోతున్నాడు. ఎమోషనల్ అండ్ యాక్షన్ పీక్స్‌లో ఉంటుందని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత.. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.