మహిళలు సున్నితమైన పువ్వులతో సమానమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పేర్కొన్నారు. మహిళలు పని మనుషులు కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా, ఖమేనీ పాలనలో తమ హక్కుల కోసం మహిళలు పోరాడుతుండటం గమనార్హం. నిరంకుశ పాలనలోని హిజాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి చేరి నిరసనలు చేస్తున్నారు.