»Police Arrest Teenmar Mallanna And Telangana Vittal
Teenmar mallanna arrest: పోలీసుల అదుపులో మల్లన్న, తెలంగాణ విఠల్.. ఎందుకంటే?
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న, విఠల్ లను అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న (teenmar mallanna), సుదర్శన్ (Sudarshan), ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను (telangana vittal) రాచకొండ పోలీసులు (Rachakonda Police) మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి (Media Office) భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న (Teenmar mallanna arrest), విఠల్ లను (telangana vittal arrest) అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు. క్యూ న్యూస్ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పైన స్థానిక జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP chief) బండి సంజయ్ (Bandi Sanjay), మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు మంగళవారం అర్ధరాత్రి తీన్మార్ మల్లన్న, విఠల్ ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
మల్లన్న, విఠల్ అరెస్టుల పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, జర్నలిస్టులు అంటే ప్రతిపక్షమని, ప్రజా పక్షమని, వారి గొంతును మూసివేయించాలనుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని, అలా చెప్పకుండానే హఠాత్తుగా వచ్చి అరెస్టు చేయడం దారుణమన్నారు. సివిల్ డ్రెస్ లో వచ్చి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వారిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ఎదుట ప్రవేశ పెట్టాలన్నారు.
పీర్జాదిగూడ వద్ద వాహనాలను మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో క్యూ న్యూస్ కు చెందిన కొందరు… విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని కర్రలతో బెదిరించి, వాళ్లను బలవంతంగా క్యూ న్యూస్ కార్యాలయానికి తీసుకు వెళ్లినట్లు ఘట్ కేసర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. గదికి తాళం వేసి, ఫోన్లు, ఐడీ కార్డులు లాక్కున్నట్లుగా పేర్కొన్నారు. పోలీసులు అని తెలిసినప్పటికీ దుర్భాషాలాడుతూ దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వెళ్లి వారిని రక్షించారని చెబుతున్నారు. ఇదే సమయంలో అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, ఈ అంశంపై దర్యాఫ్తు సాగుతోందని పోలీసులు తెలిపారు.
అయితే, వాహనాల తనిఖీ సమయంలో కొంతమంది సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్వోటీ పోలీసులు అక్కడికి కొద్ది దూరంలో కటాఫ్ డ్యూటీ చేస్తున్నారు. అదే ప్రాంతంలో క్యూన్యూస్ ఉండటంతో తమ కార్యాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానించి కొంతమంది సిబ్బంది.. పోలీసులను బెదిరించి గదిలో బంధించారు. సమాచారం తెలియడంతో అక్కడే ఉన్న మరో పోలీస్ బృందం కార్యాలయానికి వెళ్లి బందీగా ఉన్న తమ సిబ్బందిని విడిపించి, పోలీసులను తెలిసీ దాడి చేసిన క్యూ న్యూస్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.