ఎందరైనా రావచ్చు, ఎందరైనా పోవచ్చు సినిమా పరిశ్రమకి. కానీ, కొందరున్నారే….అలాక్కాదు. వచ్చారంటే మాత్రం పాతుకుపోతారు. రికార్డులు హోరెత్తిస్తారు. తామే రికార్డుగా మారిపోతారు. అటువంటి రికార్డు హోల్డరే నిర్మాత దిల్ రాజు. ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు కానీ ఆయన మాత్రం తెలియని వారుండరు. ప్రపంచంలో తెలుగువారెక్కడ ఉన్నా, ఏ సందులో ఉన్నా ఆయన పేరు కంఠోపాఠం అందరికీ, ఆదీ ఆయన రికార్డు. ఎందమంది సాధించడలరు ఇటువంటి ఘనతని. ఆయన గురించి రాసినప్పుడు వెతుక్కోనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనెందరికో ఆరాధ్యదైవం. కొందరికి ఆదర్శప్రాయుడు. మరికొందరికి నెచ్చెలికాడు. ఇంకా చెప్పాలంటే టోకున అందరికీ ఆత్మబంధువు. ఇదంతా ఆయన ఇతరత్రా సాధించింది కాదు. కేవలం సినిమా రంగంలోకి వచ్చి తన ప్రతిభతో, నైపుణ్యంతో, మంచితనం కలసిన వ్యక్తిత్వంతో మాత్రమే సాధించగలిగారు. అదీ ఆయన ప్రత్యేకత. నూటికో కోటికోగానీ సాధ్యపడే ఘనత కాదిది. దశాబ్దాల ప్రయాణంలో దిల్ రాజు అందుకున్న అసామాన్యమైన కీర్తిప్రతిష్టల బంగారు కిరీటం ఇది.
ఏదో దిల్‌రాజుని పొగుడుతున్నాం, ఆయనకి డప్పు కొడుతున్నాం అనుకుంటే అది వాళ్ళ ఖర్మ. కుక్కలు చెప్పులు వెతుకున్ అని మహాకవి మాటల్లా, అటువంటివారిని తప్పు పట్టకూడదు. వారి మానాన వారిని వదిలేయాలి. దిల్‌రాజుని ఒకరు పొగడనక్కర్లేదు. వేరొకరు మెచ్చుకోనక్కర్లేదు. మరెవరో విమర్శించనక్కర్లేదు. ఆయనంతట ఆయనే అందరూ మెచ్చుకునే పనులు చేయడంలో ఎప్పటికప్పుడు నిమగ్నమై ఉంటారు. విమర్మించవలసి వస్తే, ఆ అవకాశం ఇతరులకి ఇవ్వనే ఇవ్వరు. ఆయన్ని ఆయనే దారుణంగా విమర్శించుకుంటారు. తద్వారా జరిగిన తప్పుని సరిచేసుకుని, మళ్ళీ సరైన మార్గంలోకి రాగలిగే ఓ ప్రత్యేకమైన మెకానిజమ్ జన్మతః అబ్బిన అరుదైన వ్యక్తిత్వం దిల్‌రాజుది.
ఎప్పుడో దెండు దశాబ్దాలకు పైబడి అనుకుంటా….చిత్రపరిశ్రమలోకి వచ్చిన దిల్ రాజు అనబడే ఈ వెంకట రమణారెడ్డి అనే యువకుడు సినిమాల మీద మోజుతో చిత్రనిర్మాణానికి పూనుకోవడంతో ఒక మహత్తరమైన ప్రయాణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఎక్కడో తెలంగాణలో మారుమూల ప్రాంతంలో, సినిమా కల్చర్ పెద్దగా లేని వాతావరణంలో పుట్టి, సినిమా నిర్మాణం పట్ల అమితమైన, అపారమైన ఆసక్తిని, అవ్యాజమైన ప్రేమని పెంచుకున్నారు దిల్‌రాజు. ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికి, తెలంగాణ నుంచి చెప్పుకోదగ్గ గొప్ప పేరే లేదు. నటులున్నారు. దాదాసాహెబ్ అవార్డు గెలుచుకున్న పైడిరాజు, తర్వాతి తరంలో కాంతారావుగారు వంటివారు వచ్చారు గానీ, నిర్మాతలుగా వచ్చినవారూ లేరు. నిలదొక్కుకుని దిల్‌రాజులా దడ పుట్టించినవారూ లేరు. ఇది చరిత్ర.
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ నిర్దేశకత్వంలో రూపొందిన పెళ్ళి పందిరి చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థని స్థాపించి తెలంగాణలో పంపిణీ చేయడంతో దిల్‌రాజు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అంటే ఆయన ప్రయాణం ఒక పంపిణీదారుడిగా ప్రారంభమైందనమాట. కానీ తర్వాత రోజులలో ఆయనలో మరి ఏ ఆవేశం కమ్ముకొచ్చిందో తెలియదు కానీ, చిత్రనిర్మాణంవైపుకి ఆయన అడుగులు పడ్డాయి. అప్పుడప్పుడే ఫోకస్‌లోకి వస్తున్న వివి వినాయక్‌తో దిల్ అనే సినిమా తీసి రికార్డులు బద్దలు కొట్టి, తొలిఅడుగులోనే విజయవంతమైన నిర్మాతగా దిల్ రాజు ముద్ద వేసుకున్నారు. అదీ ఎంతో గాఢమైన నిర్మాతగా. అప్పుడే అందరి దృష్టీ ఆయనవైపుకి మళ్ళింది. ఎవరీ నిర్మాత అని. అప్పటికి ఆయనకి దిల్‌రాజు అనేపేరే లేదు. తెలిసినవారికి దెడ్డి. కొంచెం పరిచయం ఉన్నవారికి రాజు. కానీ దిల్ సినిమాతో ఆయన దిల్‌రాజుగా సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఆయన తర్వాతి చరిత్ర ఆయనన దిల్ ఉన్న రాజుగా ప్రచారం చేసింది. అదే చివరికి ఖరారైంది. ఆయనిప్పడు ప్రపంచ ప్రఖ్యాత దిల్‌రాజు.
దిల్ సినిమా నుంచి ఆయన సినిమాలేని సంవత్సరమే లేదు. ఆయన అలా లేకుండా చేశారు.ఒకే సంవత్సరంలో ఒక్కదెబ్బకి ఆరు సినిమాలు తీసి అందరినీ బెంబేలెత్తించారు. ఈ రోజున ఫైల్లో ఉన్న ఏ దర్శకుడైనా సరే దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయకుండా లేరు. అందరికీ ఆయన ఆఫీసు ఒక పెద్ద అడ్డా. ఒక గొప్ప కొలువు. ఈ రోజున ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా అయిపోవచ్చు. కానీ, ఒకనాడు మాత్రం. అందరూ ఆయన దయామృత దృష్టి కోసం పరితపించినవారే ఇది కూడా నిన్నటి చరిత్రే. ఇందులో కల్పితాలేం లేవు.. అన్నీ నిజాలే.
అక్కడితో ఆగలేదు పంపిణీదారుడిగా వేళ్ళూనుకుని తెలంగాణ సినీ సామ్రాజ్యాన్ని పూర్తిగా కైవశం చేసుకున్నారు. సినిమా రిలీఉ అవుతోందంటే దిల్ రాజు నామస్మరణ చేయని వారుండరు. వందల ధియేటర్లు ఇక్కడ తెలంగాణలోనూ, అక్కడ ఆంధ్రాలోనూ కూడా. ఎంత పెద్ద సినిమా రిలీజ్ చేయాలన్నా సరే దిల్ రాజు సువర్ణ హస్తం జోక్యం చేసుకోకుండా కుదరిని పని. అప్పుడప్పుడు ఆయన సినిమాలకి ఆయన సినిమాలే పోటీ. కానీ వాటిని చక్కబెట్టి, సజావు రిలీజులకి మార్గం ఏర్పరచడంలో పాటిలేని మేటిగా పేరు తెచ్చికున్నారు. కొందరి చేతైనా కొన్న పుంజీల తిట్టు కూడా తిన్న సందర్బాలు ఆయన కెరీర్లో లేకపోలేదు. వాటిని కూడా ఆయన చాలా సరళంగా తీసుకుని ముందుకి వెళ్తంటారు. ఈ వ్యాపారప్రపంచంలో ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత సన్నజాజి పువ్వులే కాదు, సూదంటురాళ్ళని కూడా భరించాలి. ఆయన నవ్వుతూ భరించేస్తారు. అదీ దిల్ రాజు మనస్తత్వం. వ్యక్తిత్వం.
ఇదిగో కొత్త సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాంతో సందడి ప్రారంభించి, గేమ్ ఛేంజర్‌తో కుమ్మడానికి దిల్‌రాజు కత్తులు నూరుతున్నారు. సినిమా పరిశ్రమ పూర్తిగా ఆంధ్రమేదావుల చేతిలో చిక్కుకున్నాక తెలంగాణలో తలెత్తిన మొగాడు, మొనగాడే లేడు సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవరూ కాదనలేని కఠోరసత్యం. దిల్ రాజు ప్రభతో తెలింగాణ ప్రాంతానికి సినిమా పరమైన వెలుగులొచ్చాయి. ఆయన ప్రాబల్యం పెరిగాక తెలంగాణ ఛాంపియన్స్ ఇటీవల తండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సినికళామతల్లి దీవెలనలు దిల్‌రాజుకి నిరంతరం వెన్నంటే ఉంటాయి. లేకుంటే బలగం సినిమా మరో నిర్మాత ఎవరైనా ఒప్పుకుంటారా? తన్ని తగిలేస్తారు అటువంటి కథ తెచ్చినందుకు. కానీ ఆయన ప్రోత్సహించి, వెన్నుతట్టి, బలగం కథకి తనదైన బలగాన్ని జోడించి, ట్రాక్టర్లెక్కి ప్రచారం కూడా ముమ్మరంగా చేసి సినిమాకి అఖండవిజయాన్ని అందించారు. ఎక్కడో మారుమూల స్కిట్స్ రాసుకుంటూ, సైడ్ స్క్రీన్‌లో కామెడీ చేసుకుంటున్న వేణు ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మడు. పెద్దహీరోలతో చేసే, చేయగలిగే స్థాయిలో రాజుకుంటున్నాడు. దిల్ రాజు కాకపోతే ఇది జరిగేనా…..
నేషనల్ అవార్డులు కొట్టారు. ప్రజల మనసులను దోచుకున్నారు. బాక్సాఫీసులు కొల్లగొట్టారు. కోట్లకు పడగెత్తినా, మంచి కథ ముందు మోకరిల్లిపోయే దిల్ రాజులోని సుగుణం ఆయన్ని మరింత మరింత పంచుతుంది. ఎంత విలువైన బంగారానికైనా సువాసన ఉండదు. అది ప్రకృతిలోని వింత. అదే బంగారానికి సువాసన అబ్బితే….అబ్బింది. తాజాగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఫిల్మ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించి తనకున్న అభిరుచిని చాటుకుంది. నూటికి కోటిపాళ్ళు ఆయన్ని మించిన విలువైన వ్యక్తి ఆ పదివి భూతద్దం పెట్టి వెతికినా ఎవ్వరూ పట్టుకోలేరు. సినిమా రంగానికి సంబంధించి ఆయనకి తెలయిని అణువు లేదు. అడుగు లేదు ఆయన పరిష్కరించలేని సమస్యలేదు, ఆయన దగ్గర లేని సుళువు లేదు. దిల్‌రాజు అంటే వణుకుతారు. ఎందుకంటే ఆయనేమీ ఆరడుగుల ఆజానుబాహువు కాదు. కానీ ఆయన ప్రయాణం చాలా ఆరుదైనది. ఆయన వ్యక్తిత్వం చాలా అమూల్యమైనది. ఆ అనుభవం ఒక గని. అప్పుడెప్పుడో పైడిరాజుగారికి వచ్చింది దాదా సాహెబ్. మళ్ళీ దిల్ రాజుకే రావాలి. వస్తుంది. అంతకు మించిన అత్యున్నత పౌరపురస్కారాలు లభించినా కూడా ఆశ్చర్యం లేదు. అదీ ఆయన ప్రయాణంలోని గాఢత. దిల్‌రాజు పుట్టినరోజు ఇశ్వాళ.
హిట్ టీవి ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.