పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘OG’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో నటి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ మేరకు నేహా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.